Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అచ్చంపేట రూరల్ : నేడు ప్రధానమంత్రి పుట్టిన రోజు దినోత్సవం కాదని జాతీయ నిరుద్యోగ దినోత్సవం గా ప్రకటిస్తున్నామని అచ్చంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు బద్దుల అజయ్ యాదవ్ అన్నారు. ఆదివారం నాడు అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అచ్చంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లా డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీకష్ణ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి మోడీ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా నేడు ఆయన పుట్టినరోజు ను జాతీయ నిరుద్యోగ దినోత్సవం గా ప్రకటిస్తూమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ యాదవ్ , అచ్చంపేట మండల అధ్యక్షులు దశరథం, బల్మూరు మండల అధ్యక్షులు సాయి, యూత్ కాంగ్రెస్ తాలుకా నాయకులు రంగాపూర్ శివ, భరత్ రెడ్డి తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజు ఉప్పునుంతల మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్ అచ్చంపేట మండల్ ఉపాధ్యక్షులు వెంకటేష్ , పదరా మండల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ నరసింహ ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసిడెంట్ వినోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు షారుక్, జాంగిర్, సాయి యాదవ్ ,వంశీ రమేష్ గోపి నాగిరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.