Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిమ్మాజిపేట : గ్రామాలలో ఇంటి ఆవరణలో రైతులు సామూహిక మొక్కలలో కూరగాయలను పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ లు పిలుపునిచ్చారు. పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఆవంచ గ్రామంలో పోషణ అభియాన్, సామూహిక మొక్కల పెంపకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఆదిశంకర్ లు మాట్లాడుతూ ప్రతి రైతు ఇంటి ఆవరణలో కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఇంటికి కావలసిన కూరగాయలు సమకూరుతాయని సూచించారు. కూరగాయల మొక్కలు పెంచుకోనీ వాటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల స్థాయి పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ అజరు కుమార్ గ్రామంలో రైతుల పరిస్థితులు వారికి కావలసిన వివిధ వ్యవసాయ అంశాల గురించి ప్రస్తావించారు. గ్రామానికి కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్న సేవల గురించి ఆయన కొనియాడారు. ఇఫ్కో సంస్థ అధికారి బాలాజీ నానో యూరియా వాడకం దాని యొక్క లాభాల గురించి రైతులకు వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆఫిఫా జహాన్ మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర పెరటి తోటల పెంపకం వలన కలిగే ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో సంస్థ సహకారంతో రైతులకు కూరగాయల విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ సాయిరామ్, ఎంపీటీసీ శారద, డిప్యూటీ సర్పంచ్, రావేప్ విద్యార్థులు హైమావతి, యాస్మిన్, ఆకాంక్ష, గీతాంజలి, తారక, మౌనిక ,పాల్గొన్నారు.