Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- గట్టు
మండల పరిధిలోని మాచర్ల గ్రామానికి చెందిన సత్తెమ్మ 48 సంవత్సరాలు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గట్టు ఎస్సై పవన్ కుమార్ వివరాల ప్రకారం సత్తెమ్మ భార్య 6 నెలల క్రితం భర్త జయన్న అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక అనారోగ్యానికి గురై హాస్పిటల్కు తిరిగిన బాగు కాకపోవడంతో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లోని హాల్లో ఉన్న తొట్ల కుండీల కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది కొడుకు బయటి నుంచి ఇంట్లోకి రాగా చూసేసారికి ఆమె చనిపోయింది .ఈ విషయాన్ని గట్టు పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు అనంతరం గట్టు ఎస్సై పవన్ కుమార్ సంఘటన స్థలానికి పరిశీలించి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.