Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెంట్లవెల్లి
గంజిలో పడి రెండేళ్ల పాప మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో అన్నం గంజిలో పడి తేజస్విని చనిపోయింది. ఈనెల 10న అన్నం వంచిన గంజి గిన్నెలు పడింది.దీంతో కింది భాగం పూర్తిగా కాలిపోయిందన్నారు. చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రి తరలించగా అక్కడి నుండి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడి నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.