Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ వనపర్తి : సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు, వీధి వ్యాపారులకు సకాలంలో రెండవ విడత రుణాలు అందించి, వారి ఆర్థికాభివద్ధికి కృషి చేయాలని బ్యాంక్ అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో డీసీసీ, డీఎల్ఆర్సీ 2022-23 సంవత్సరానికి త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లీడ్ బ్యాంక్ అధికా రులు వీధి వ్యాపారులకు రెండో విడత అందించాల్సిన రుణా లపై, బ్యాంకర్లు ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే రుణాలపై ప్రచారం చేసి, ప్రజలలో అవగాహన కల్పించి ప్రభుత్వ రుణాలను సకాలంలో అందజేయా లని ఆమె తెలిపారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు 100 శాతం రుణాలు అందించేలా బ్యాంకర్లు కృషి చేయాలని ఆమె తెలిపారు. వినియో గదారులు బ్యాంకు ఖాతాలు తెరిచేం దుకు పూర్తి సహకారం అందించాలని బ్యాంకు అధికారులకు ఆమె సూచించారు. వీధి విక్రయ దారులకు బ్యాంకుల ద్వారా రెండవ విడత రూ.50,000/- లు రుణాలు అందించాలని, మున్సిపాలిటీ పరిధిలో వీధి విక్రయ దారుల సౌలభ్యం కోసం విక్రయదారుల జోన్ ఏర్పాటు చేశారన్నారు. విక్రయదారులు అందులో వారు వ్యాపారం కొనసాగించేలా చూడాలని ఆమె తెలిపారు. రైతులకు కొత్త రుణాలు అంద జేసే లా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడో శుక్రవారం రైతులతో బ్యాంకర్లు సమావేశాలు ని ర్వహించి రుణాలపై చర్చించా లని ఆమె తెలిపారు. బ్యాం కుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నదని సెప్టెంబర్ 30వలో పు సబ్సిడీ రుణాల మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల కొరకు దరఖాస్తు చేసుకున్న వాటిని పెండింగ్లో ఉంచరాదని, వెంటనే రుణాలు అం దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్హె చ్జి గ్రూపుల బ్యాంకు లింకేజీ, కొత్త సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ జీవీబీ పెండింగ్ రుణాలు లేకుండా చెల్లిం చాలని ఆమె ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లోన్లు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలన్నారు.
జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికల వద్ద రైతులతో బ్యాంకర్లు, వ్యవ సాయ అధికా రులు సమావేశం ఏర్పాటు చేసుకొని, రుణాలు ఇతర సమస్యలపై చర్చిం చాలన్నారు. మహిళా సంఘాలకు సంబంధించి రుణాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకో వాలని ఆయన తెలిపారు. బ్యాంకర్లు రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని, మరిన్ని సేవలు అందించే లా వారు కషి చేయాలన్నారు. మత్స్య పరిశ్రమ, కోళ్ల పరిశ్రమపై బ్యాంకర్లు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఏఎన్ అమూల్ పవార్ మాట్లాడుతూ రుణాల మంజూరులో వీధి విక్రయదారులను బ్యాంకుల చుట్టూ తిప్పుకో వద్దని, బ్యాంకులు సత్వరమే రుణాలు మంజూరు చేయాలని ఆయ న సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ అమూల్ పవార్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, మహిళా సంఘాల అధ్యక్షులు, జిల్లా అధికారులు, వీధి విక్రయదా రులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.