Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ స్థానిక మ్మెల్యే గువ్వల
నవతెలంగాణ-పదర
నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. గిరిజనులకు10శాతం రిజర్వేష న్, గిరిజన బంధు, పోడు భూములు సాగుచే సుకుంటున్న అర్హులైన గిరిజనులు అందరికీ హక్కు పత్రాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అనుకూలంగా ప్రకటించడంతో అందుకు కృతజ్ఞతగా గిరిజన సోద రులు శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం నుంచి పదర మండలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులు ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సన్మానిం చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అచ్చం పట నియోజకవర్గం సాగు నీరు అందించ డా నికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అ న్నారు. నల్లమల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయ డం కోసం కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. త్వరలో సాగు నీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆ ర్చే భూమి పూజ చేయిస్తానని ప్రజలకు ఆయ న హామీఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ క్యా నాయక్, జెడ్పీటీసీ రాంబాబు, టీిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, ఎంపీటీసీ ఎల్లమ్మ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ ముత్యాలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.