Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులు చేయడమే ఫ్రెండ్లీ పోలీస్.!!
- మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నవ తెలంగాణ -కందనూలు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిన తిమ్మాజీపేట తాడూర్ ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ లను ముట్టడించి మహాధర్నా చేపడతామని అప్పటికీ వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు జిల్లా కేంద్రంలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు బదిలీలలో రాజకీయ జోక్యం వల్ల ఆయా మండలాలలో ఎస్ఐలు సిఐలు స్థానిక ఎమ్మెల్యేలు ఏది చెబితే అదే వేదంగా భావిస్తూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక బిక్రయ ఆదాయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భూమాఫియా ఇసుక రవాణా పై పూర్తి ఆధారాలు సేకరించామన్నారు. త్వరలో బాంబులు పేలు స్తానని హెచ్చరించారు. మెడికల్ కళాశాల భూ నిర్వాసితులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచిన డబ్బు ఎక్కడిదని దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు అక్రమ ఇసుక రవాలను అరికట్టాలని జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు ఎంపీ కల్వకుర్తి ఎమ్మెల్యే అధికారులను డిమాండ్ చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అధికారులు స్థానిక ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీగా భావిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉందని అన్నారు అధికార పార్టీ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని పోలీసులపై మండిపడ్డారు ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి నారాయణ గౌడ్ పాండు బాలా గౌడ్ లక్ష్మయ్య నిజాముద్దీన్ చంటి తదితరులు పాల్గొన్నారు.