Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెంట్లవెల్లి
పురుగుల బియ్యాన్ని మార్చండని అధికారులకు తహసీల్దార్ దామోదర్ అదేశించారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల, ప్రాథమిక ఉన్నత పాఠశాల ను సందర్శించి పురుగులు పడ్డ బియ్యాన్ని పరిశీలించిన తహసీల్దార్ దామోదర్ ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజులుగా పురుగులు పడ్డ బియ్యాన్ని వంట మనుషులతో పురుగులను వేరు చేసి అన్నం వండి నప్పటికీ అవి తప్పిపోయి అన్నంలో పురుగులు వస్తున్నాయని సమాచారం రావడంతో పాఠశాలలను సందర్శించి పురుగులు పడ్డ బియ్యాన్ని పరిశీలించినట్లు ఆయన తెలిపారు, చిట్యాలు కట్టిన బియ్యం, తెల్లాపురుగులు పడి ఉన్నటువంటి బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పెట్టొద్దని, ప్రధానోపాధ్యా యులకు ఆయన సూచించారు, పురు గులు పడిన బియ్యాన్ని వెంటనే ఆపేసి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని సంబం ధిత సివిల్ సప్లై అధికారులకు ఆయన ఫోన్ ద్వారా సమా చారం అందించి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం లో నాణ్యమైన బియ్యాన్ని తెప్పించి మధ్యాహ్నం భోజనం నాణ్యమైన ది విద్యార్థులకు అందిస్తామని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు, గ్రామ యువకులు శేషు, యువజన సంఘం నాయకులు రమణ యాదవ్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం నుండి నేటి వరకు పురుగులు పడిన బియ్యాన్ని చిట్యాల కట్టిన బియ్యాన్ని సరఫరా చేస్తున్న ఉన్నతా ధికారుల దృష్టికి గతంలో విద్యార్థులకు అన్నంలో పురుగులు రావడం లాంటి సమస్యలపై పలుమార్లు ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటికి మార్పు రాలేదన్నారు. పురుగులతో కూడిన మధ్యాహ్నం భోజన ంలో పిల్లలకు అన్నంలో పురుగులు రావ డంతో అవి తిన్న పిల్లలకు అనారోగ్యం పాలై వాంతులు, విరోచనాలు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. తక్షణమే నాణ్యమైన బియ్యాన్ని అందించి విద్యార్థు లకు న్యాయమైన భోజనం మధ్యాహ్నం అందించా లని వారి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు బలరామకృష్ణ రావు, బలరాముడు, తదితరులు పాల్గొన్నారు.