Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేదల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యం చూపిస్తున్నాడని రేపు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన పేద ప్రజలే వాటిన ఆక్రమించుకొని నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో గాంధీ పార్క్ లో రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తనకు లాభాలు వచ్చే పనులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే పనులను మాత్రం చేయడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే చేతకానితనంతోనే ఇన్ని రోజుల కైనా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో కే గీత ,యాదయ్య ,మండల కార్యదర్శి అశోక్ ,నాయకులు రామయ్య కాశన్న శ్రీకాంత్, సత్యనారాయణ, శివకుమార్ ,నరేందర్ రెడ్డి, ఈశ్వరమ్మ, లక్ష్మమ్మ బాధితులు పాల్గొన్నారు.