Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంసంలో... పోషకాలు.. ఔషధ...గుణాలు...
- గుడ్డు ఆరోగ్యదాయకం: నిపుణులు
కడకనాథ్ కోడి మాంసం తినడం వల్ల జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలిపారు. దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
నవతెలంగాణ - కోడేరు
కోడేరు మండల కేంద్రంలోని రాజేష్ అనే వ్యక్తి కడకనాథ్ కోళ్లు పెంచుతూ పలువురికి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. కడకనాథ్ కోళ్ల విలువైన సమాచారం. కడకనాథ్ కోడి మాంసం తినడం వల్ల జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలిపారు. దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు కడక్‌నాథ్ కోడి మాంసాన్ని హౌమియోపతిలో నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కూడా కడక్‌నాథ్ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, మూలికావైద్యంలో ఉపయోగిస్తారు...
మాంసంలో...పోషకాలు.. ఔషధ...గుణాలు...
కడక్‌నాథ్ కోడి మాంసం అంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది, దీని కోడి మాంసంలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి. బాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్ కోడిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ, పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షి యం, ఫాస్ఫరస్, ఐరన్ నికోటినిక్ ఆసిడ్స్ ఉంటాయి. ఇక ఈ కడక్ నాథ్ కోడి మాంసంలోని ఔషధ గుణాలపై సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మైసూర్ వారు ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుందట. వయాగ్రాలోని సిల్డెనాఫిల్ సిట్రిక్ రక్త సరఫరా పెంచడం ద్వారా వైవాహిక సామర్థ్యం పెంచుతోంది. అదే గుణం ఈ మాంసానికి, రక్తానికి ఉందంటారు.
మరిన్ని ఔషధ లక్షణాలు...పోషకాల గురించి...
పాస్పరస్, ఇనుము వంటి ధాతువులు మానవ శరీరానికి ఎంతో అవసరమైనవి. ఈ కోడి మాంసంలో ఇనుప ధాతువు బి2 అధికంగా ఉండటం వలన న్యూమోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన ఓమోగా ఆమూల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీటి గుడ్లని తలనొప్పి నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడుతారు. వయసు మళ్ళీన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకయమిని నిపుణులు చేప్పారు.
తక్కువ ధరకే కోడి మాంసాన్ని అమ్ముతున్నాం
కో డే రు. మండల కేంద్రంలోని జనంపల్లి రోడ్డు పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న కోళ్ల ఫామ్ లో కడకనాథ్ కోళ్లు పెంచడం. కడకనాథ్ కోడి మాంసం బయట మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌తో అధిక రేటు ఉన్న ఇక్కడ తక్కువ ధరకే కోడిని, మాంసాన్ని అమ్మడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వి. రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సంప్రదించాల్సిన నెంబర్ 6309782760
వి. రాజేష్ కొళ్ల , యాజమాని.