Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- మార్నింగ్ వాక్‌లో తాళ్లచెరువు, లక్ష్మికుంట సందర్శన
నవ తెలంగాణ- వనపర్తి
సాగునీటి రాకతో భూగర్భ జల్లాలు పెరిగా యని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్‌లో తాళ్లచెరువు, లక్ష్మీకుంట పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్‌లో నీటి ఎద్దడి రాకుండా నగరం చుట్టూ చెరువులు పటిష్టం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేశాయని, తాము అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. సాగునీరు సంగతి పక్కన పెడితే వానాకాలంలోనే తాగునీటికి తండ్లాడే పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు చెరువుల పునరుద్ధరణ పనులు, నీటితో నింపడం వంటి చర్యలతో ఆ ఇబ్బంది ఉండబోదన్నారు. ఆ పరిస్థితి మళ్లీ రావద్దని వనపర్తి చుట్టూ ఉన్న నల్ల చెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం అమ్మచెరువు, శ్రీనివాసపురం లక్ష్మీ కుంటలను పటిష్టం చేశామన్నారు. నాడు వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదన్నారు. నేడు పునాదులు తవ్వితే భూగర్భ జలాలు ఎగిసిపడుతున్నాయని మంత్రి చెప్పారు. వనపర్తి జిల్లాలో రాష్ట్రంలోనే మిగతా జిల్లాల కన్నా పైకి భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 4.40 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంపై దృష్టిసారించడం వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు పక్కన పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేశా మన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్నారు. వచ్చే ఏడాది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తవుతాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం అయితే పాలమూరు కోన సీమను మించిపోతుందని చెప్పారు. ఆ కార్యక్ర మంలో వనపర్తి పట్టణ ప్రజా ప్రతినిధులు, అధి కారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.