Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులను రూ. 293 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని కోటకద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చుచున్నా యని వారు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని 20 ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ప్రారంబిచినట్లు వారు తెలిపారు. పాఠశాలలో కనీస వసతులు మరమ్మతుల కోసం 293 కోట్లు ఖర్చు చేస్తున్నామని వారు అన్నారు. జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో నాలుగువేల 4742 మంది విద్యార్థులకు 47 పాఠశాలలో నాణ్యమైన భోజనం ప్రతిరోజు అందిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులను అందరూ ప్రాథమిక చదువు నుండి ఉన్నత చదువు వరకు కష్టపడి చదివితే వారు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి వీలవుతుందని తెలిపారు. మన్నెంకొండ దేవస్థానని అతివేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఒకేసారి వందమంది జంటల పెళ్లిళ్లు జరిగే విధంగా కొత్త షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ , రైతుబంధు అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి పాల్గొన్నారు.