Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాలీవుడ్ అందాల తార కేథరిన్ థ్రెసా సందడి
కందనూలు : దేశంలోని ఈ ప్రాంతంలో కుటుంబ యజమాన్యంలోని అతిపెద్ద వస్త్ర సామ్రా జ్యాలలో ఒకట్కెన - మాంగళ్య షాపింగ్ మాల్‌ను శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో తన 14వ షాపింగ్ మాల్‌ను టాలీవుడ్ అందాల భామ కేథరిన్ థ్రెసా ఈ మెగా షాపింగ్ మాల్‌ను మాంగళ్య షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు పి.ఎన్.మూర్తి, మాంగళ్య షాపింగ్ మాల్స్ చైర్మన్ కాశీం నమ:శివాయ, మాంగళ్య షాపింగ్ మాల్స్ డైరెక్టర్లు, శ్రీకాసం శివప్రసాద్ పుల్లూరు అరుణ్‌తో కలసి ప్రారంబిచారు.ఈ సందర్బంగా హీరోయిన్ కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ 14వ షోరూంను ప్రారంభించి నందుకు ఆనందంగా ఉందన్నారు. గతంలో నాగర్ కర్నూల్ వాసులు పెళ్ళిళ్ళు వంటి శుభసందర్భాలకు కావ లసిన వస్త్రాల షాపింగ్ కోసం హైదరాబాద్ లేదా కాంచీపురం వరకు కూడా వెళ్లేవారని, కానీ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు నాగర్‌కర్నూల్ పట్టణానికి రావడంతో వారికి కావాల్సినవన్నీ ఒకే చోట ఇక్కడ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ నూతన స్టోర్ తెలుగు రాష్ట్రాల్లో 14వ స్టోర్ మరియు ఇది 15,000 చ.అ.ల సువిశాలమైన విస్తీర్ణంలో ఏర్పాటైందన్నారు. ప్రతిఒక్కరి కోసం అత్యుత్తమమైన కలెక్షన్ అందుస్తున్నది. మహిళల కోసం అనేక రకాల చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రెస్ మెటీరియల్స్ మరెన్నో అందుబాటులో వున్నాయన్నారు.
మాంగళ్య షాపింగ్‌మాల్ గురించి : 1942 సంవత్సరంలో ఒక రిట్కెల్ ఫ్యాషన్ స్టోర్‌గా ప్రారంభమైన కాసం గ్రూప్‌కు చెందిన మాంగళ్య షాపింగ్ మాల్ 2019 నాటికి కుటుంబ వ్యాపారపు అతిపెద్ద టెక్స్ట్కెల్ కింగ్డమ్గా అవతరించింది. మొత్తం 12 స్టోర్లతో అతిపెద్ద నెట్‌వర్క్‌తో, 7000 మందికి పైగా ఉద్యోగులను కలిగివుండడంతో పాటు మొత్తం స్టోర్లు 3,00,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి. తెలంగాణలోని మరే ఇతర వస్త్రశ్రేణి మాల్స్ అందించని రీతిలో మాంగళ్య షాపింగ్‌మాల్ తన కస్టమర్ల యొక్క ఫ్యాషన్ ఆకాంక్షలకు మరియు స్టయిల్స్‌కు అత్యధిక ప్రాధాన్యాతనిస్తూ అన్నింటికిమించి కస్టమర్ల డబ్బుకు తగిన విలువనిస్తూ, అద్బుతమైన కలర్లు మరియు స్టయిల్స్‌లో విస్త్రతశ్రేణికి చెందిన డిజ్కెన్లు మరియు కలెక్షన్లును అత్యంత నాణ్యతగా అందించడంలో తన నిబద్దతను చాటుకుంటున్నది. వివాహ వేడుకుల చీరలకు ప్రసిద్దిగాంచిన మాంగళ్య షాపింగ్ మాల్ మునుపెన్నడూ లేనివిధంగా వివాహా వేడుకల కలెక్షన్ డిజెన్లను ప్రత్యేకంగా అందిస్తున్నది.