Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈదులన్నీ వట్టి మొద్దులైనవి... ఈత కల్లు బంగారమెనది అనే పాట గౌండ్ల జీవన విధానాలకు అద్ధం పడుతోంది.కార్పోరేట్ పెరుగటంతో వ్యవసాయం అంతరించిపోతుంది. ఈత, తాటి వనాల వల్ల గిత కార్మికులకు ఉపాధి లేకుండాపోయింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ భూములు, వాగులు,వంకల దగ్గర ఈత చెట్లను నరికివేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఊపందుకుకోవడం వల్ల ఈత వనాలు కనుమరుగవుతున్నాయి. అంతేకాకుండా ఈత చెట్లను కోట్టరాదనే నిబంధనలున్నా రియల్ మాఫియా విచ్చలవిడితో వనాలు నరికి రియల్ భూములు, ఫామ్ హౌజ్‌లుగా మార్చుతున్నారు. దీంతో ఉపాధి లేక గిత కార్మికులు హైదరాబాద్‌కు పోయి మట్టి పనులు మేస్త్రీ చేతి కింద పనులు చేస్తున్నారు. ఈత వనాలతో ఇతర వనాలు పెంచి ఆదుకోవాలని గీత కార్మికులు కొరారు.
- గౌడ కంచంలో రాళ్లు
- ప్రభుత్వ భూములు కబ్జాలు ?
- ఈత, తాటి వనాలు నరికివేత
- వలసబాటలో గీత కార్మికులు
- పట్టించుకొని పాలకులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో కారుచౌకగా భూములను ఖరీదు చేసి ఫాం హౌజ్‌లను నిర్మిస్తున్నారు. వెల్దండ మండలం చౌదరపల్లి సమీపంలో స్పెక్ట్రమ్ కంపెనీ వారు 500 ఎకరాల భూమిని ఖరీదు చేశారు. దీనికి సమీపంలో మరో 100 ఎకరాలలో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఈత చెట్లు ఉండేవి. వీటిని తొలగించి రియల్ ఎస్టేట్‌గా మార్చారు. కల్వకుర్తి నుంచి రఘుపతిపేట, తర్నికల్ వరకు సాగు భూములతో పాటు ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసింది. చారకొండ, సిర్సనగండ్ల, తర్నికల్ ,యాదిరెడ్డిపల్లి, ఎల్లికల్ తదితర ప్రాంతాలలో వందల ఎకరాలలో తాటిచెట్టు ఉండేవి. ప్రయివేటు భూముల్లో ఉన్న ఈత చెట్లను గీచి ఉపాధి పొందేవారు. ఇప్పుడా పరిస్థితుల్లేవు.. ఈత చెట్లను నరకరాధనే నిబంధనలున్నా... మాఫియా బేఖాతర్ చేస్తోంది. ప్రభుత్వం సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. బల్మూరు మండలం విప్పకుంట గ్రామంలో 20 గౌడ కుటుంభాలు ఉంటాయి.దిని మిద ఆధారపడి 100 మందికి పైగా జీవిస్తున్నారు. ఇదే గ్రామంలో కృష్ణయ్యగౌడ్, నారాయణ గౌడ్లు అన్నదమ్ములతో పాటు గౌండ్లు అంతా ఇదే వృత్తిమీద ఆధారపడి జీవించేవారు. అయితే సర్కారు భూములతో పాటు ప్రయివేటు భూములు మొత్తం కార్పోరేటు వారి చేతుల్లోకి వెల్లింది. దీంతో చేసేది లేక కొంత మంది హైదరాబాద్ నగరానికి వలస పోయారు. కృష్ణయ్య, నారాయణలు మాత్రం తమకు ఉన్న ఐదెకరాలలో ఈత వనాలు పెంచారు. ఎనిమిది ఏండ్ల్ల క్రితం నాటిన చెట్లు ఇప్పుడు గీతకు వచ్చాయి. ఇదే విదంగా ప్రతి గ్రామం లోనూ...ఈత, తాటి చెట్లు పెంచితే గీత కార్మికులకు ఉపాధి లభిస్తో ందని గీత కార్మికులు తెలిపారు. ఉమ్మడి మV ాబూబ్నగర్ జిల్లాలో 45వేల మంది గౌడ కుటుంబా లుంటాయి. టీఎఫ్టి, టీపీఎస్‌లో సభ్యులుగా 2500 మంది ఉన్నారు. వీరికి చెట్లు లేకపోవడం వల్ల ఇప్పుడు వీరి లైసన్సును రినివల్ చేయడం లేదు. వీరిలో 80 శాతం మంది గీత వృత్తిని వదలి ఉపాది కోసం హైదరాబాద్, ముంబాయి వంటి దేశాలకు వలసపోయారు.
ఉపాధి కల్పిస్తే...మెరుగైన జీవితం
ఉమ్మడి జిల్లాలో ఈత వనాలు బలంగా ఉన్న ప్రాంతాలలో సైతం చెట్లను నరికివేస్తున్నారు. ఈత వనాలు నాటితే ఐదేళ్లలో గీతకు వస్తోంది. ఒకో చెట్టు నుండి 45 రోజులు కల్లు వస్తోంది. ఒక చెట్టుకు ప్రతి రోజు రెండు లీటర్ల కల్లు వస్తోంది. 45 రోజుల కాలంలో ఒక చెట్టు నుండి రూ.6750 లు ఆదాయం వస్తోంది. వంద చెట్లు గీస్తే... రూ.6 లక్షల 750 లు ఆదాయం వస్తోంది. రెండు కుటుంబాలు సులభంగా బతకగలవు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈత వనాలు పెంచాలని పలువురు కోరుతున్నారు.
ఈత వనాలు పెంచి ఉపాధి కల్పించాలి
మేము మాతాత తండ్రుల నుంచి గీత వృత్తిలోనే జీవిస్తున్నాం. గతంలో ఏ డొండలో చూసినా.. చెట్లు ఉండేవి. ఇప్పుడు సాగుకోసం చెట్లను నరుకుతున్నారు. అధి కారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహ రిస్తున్నారు. గౌడ కుటుంభాలకు నేరుగా ఈత వనాల పెంపుకోసం రుణాలు ఇచ్చి ఉపాది కల్పించాలి.
- కృష్ణయ్యగౌడ్, విప్పకుంట, బల్మూరు మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
వనాలు పెంచాలి
జిల్లాలో గౌడ జీవితాలు దయనీయంగా ఉన్నాయి. ఎవ్వరూ.. సుఖంగా ఉండటం లేదు. గతంలో ఉన్నట్లుగా చెట్లను నరకడాన్ని నిషేదించడం లేదు. పట్టా భూము లైనా .. గతంలో చెట్లను నరకడం నివారించే వారు. ఇప్పుడా పరిస్థితులు లేవు.
- విజయ్‌గౌడ్, గౌడసంఘం నాయకులు తెలకపల్లి