Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కృష్ణ
గంజాయి రహిత రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ డీఎస్పీ నర్సింహారెడ్డి కోరారు. మండలంలోని ఖానదొడ్డిలో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే నిదానంతో కూడిన ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి మె ుక్కలు నాటొద్దని, గుట్కాలు అమ్మవద్దని, మద్యం సేవిం చవద్దని గ్రామ యువతకు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. గంజాయి సాగు, విక్రయం రవాణా నేరమన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని పో లీసు, రెవెన్యూ, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా కృషి చేస్తామ న్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ నరేందర్ గౌడ్, ఎక్సైజ్ ఎస్సై సందీప్ రెడ్డి, కానిస్టేబుల్ సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ జయలక్ష్మి తిప్పయ్య, ఏఎస్ఐ సురేంద్రబాబు,. పాఠశాల హెచ్ఎం శేఖర్, కార్యదర్శి నరసింహ రెడ్డి, పోలీస్ సిబ్బంది రామస్వామి, ఉప సర్పంచ్ అశోక్, ఏఈవో మోహన్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.