Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య
నవతెలంగాణ- తెలకపల్లి
దివ్యాంగ బాలబాలికలకు ప్ర భుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య అన్నారు. శుక్రవారం మండలంంలోని భవిత విలీన విద్యావన రుల కేంద్రం ( ఐఈఆర్సీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నేర్పిస్తు న్న కత్యాలు, వారికి అందిస్తున్న సేవల గు రించి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు అం దిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వి ద్యార్థులకు సంబంధించిన రికార్డులను పరిశీలించా రు. మండల విద్యా వనరుల కేంద్రంలో వి ద్యార్థుల వివరాల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య, ఐఈఆర్పిలు బాల్ నరసింహా, రాజవర్ధన్ రెడ్డి, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ కాశీనాథ్, వెంకటేష్, శ్రీను ఉన్నారు.