Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బాలానగర్
పార్టీలు ముఖ్యం కాదని గ్రామాలాభివృద్ధి ముఖ్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలో ని శుక్రవారం వివిధ గ్రామాల్లోని పలు అభివృద్ధి ప నులను ఆయన ప్రారం భించారు. మండల పరిధి లోని తిరుమలగిరి, చిన్న రేవెల్లి, పెద్ద రేవెల్లి, బోడ జానంపేట, మోతీగనాపూర్, ఉడిత్యాల, గుండేడ్, నేరళ్లపల్లి గ్రామాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్, ఆసరా పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. దేశంలోని ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుందని, రైతులకు రైతు బీమా, వృద్ధులకు వితంతువులకు, వికలాంగులకు రె ట్టింపు పింఛన్ ఇస్తున్న ఏకైక తెలంగాణ ప్రభుత్వమ న్నారు. మండలం నుంచి చిన్నరేవెల్లి వరకు త్వరలో డబుల్ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపా రు. అదేవిధంగా తిరుమలగిరి టు కోడుగల్ వరకు గ్రామ సర్పంచ్ మేరకు బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తామ న్నారు. అనంతరం ప్రతి గిరిజన తండాకు జాతీయ రహదారి నుంచి మండలం నుంచి వీధి రోడ్లను ఏ ర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీటి కోసం మిషన్ భగీరథ నీళ్లను అందిస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. తెంగాణ ప్రభుత్వం వ చ్చిన తర్వాతనే అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామ న్నారు. ఇతర పార్టీల కల్లబొల్లి మాటలు కవులు న మ్మరాదని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో సభ్యురాలు జెడ్పీటీసీ జరుపుల కల్యాణి, జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, చైర్మన్ వాల్యనాయక్, రాష్ట్ర గిరిజన నాయకులు లక్ష్మణ్ నాయక్, మండల టీిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, తిరుమలగిరి సర్పంచ్ కేస్లీ బారు, చిన్న రేవెల్లి సర్పంచ్ లక్ష్మీ చంద్రమౌళి, సర్పంచ్ నర్మదా లింగారెడ్డి, మోతీగణపూర్ సర్పంచ్ అనిత యాదిరెడ్డి, ఉడిత్యాల సర్పంచ్ మల్లేష్ యాదవ్, సర్పంచ్ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు మండల తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో కృష్ణారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.