Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కోస్గి
గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల కోసం రకరకాలుగా లభిస్తున్న ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని క్లస్టర్ రాములు అన్నారు. శుక్రవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరవిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా బాలికల కోసం అందిన ఉచిత సైకిల్ ను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాలనుండి చదువుకునేందుకు పాఠశాలకు వస్తున్న బాలికల సౌకర్యార్థం అరబిందో సంస్థ తమ వంతు సహాయంగా ఉచితముగా సైకిళ్ళు అందజేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. బాలికల చదువు కోసం ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు శ్రద్ద చూపడం హర్షణీయమన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలు చదువు ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి రోజు బడికి సక్రమంగా హాజర య్యే లా చూడాలని ఇతర కుటుంబ పనుల కోసం తాత్కాలికంగా వారి విలువైన సమయాన్ని వృథాచేయవద్దని కోరారు. పాఠశాలకు హాజరై చక్కగా చదు వుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలకు వెళ్ళే సమయంలో రోడ్డు నిభందనలు పాటిస్తూ జాగ్రత్తగా రాకపోకలు సాగించాలని అన్నారు మొదటి విడతగా అందిన సైకిళ్లు ప్రస్తుతం పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పోషప్ప, చైర్మన్ వెంకటయ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.