Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
నవ తెలంగాణ- కొత్తకోట
గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ప్రగతిశీల పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండలంలో కార్మికుల డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించి స్థానిక ఎంపీపీ గుంత మౌనికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. పెరిగే ధరలకు కనీస వేతనాలు 26 వేలకు సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించాలని అదనపు సిబ్బందిని పంచాయతీలలో వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కరీం, బుజ్జన్న, బాలరాజు, హనుమంతు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.