Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్వకుర్తి : బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ కు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ కు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ కాశన్న యాదవ్ ఆనంద్ కుమార్ బాల స్వామి గౌడ్ బడే సాబ్ మహేష్ యాదవ్ చందు గౌడ్ హరీష్ కుమార్ బాల వర్ధన్ గౌడ్ తాళ్ల సురేష్ వీరస్వామి పాల్గొన్నారు.