Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ పట్టణంలో ఈనెల 25వ తేదీన జరిగే ఇంటర్ స్టేట్ కరాటే టోర్నమెంట్ కి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కేశవరెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు మాస్టర్ సయ్యద్ అశ్వక్ తెలిపారు. శుక్రవారం ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్ చంద్రహాసన్ రెడ్డి ఏజీఎం శరత్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ పట్టణంలో ఈనెల 25వ తేదీన ఇంటర్ స్టేట్ ఐదవ కరెక్టే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. కేశవరెడ్డి పాఠశాలకు చెందిన జస్వత్. భరత్ .రూపేష్ పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఆ టోర్నమెంటులో విజయం సాధించి పాఠశాలకు గుర్తింపు తేవాలని వారికి సూచించారు.