Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్వకుర్తి : అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయ వంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ మనోహర కేశవులు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంపీ రాములు హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి మండలం లో ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని వాటిని సక్రమంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ పిఆర్డిఈ దుర్గాప్రసాద్ విద్యుత్ ఏయి శ్రీనివాస్ ఎంపీడీవో తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.