Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట టౌన్ : అక్టోబర్ 30, 31 తేదీలలో సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ , సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రామిరెడ్డి, బలరాం పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం సీఐటీయూ జిల్లా స్థాయి జనరల్ బాడీ ఆహ్వాన సంఘం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సీఐటీయూ సంఘమన్నారు. వచ్చే నెలలో నిర్వహించే సీఐటీయూ జిల్లా మహాసభలకు ఉద్యోగ కార్మిక వర్గం ప్రజాస్వామ్యవాదులు అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఆహ్వాన సంఘం జిల్లా అధ్యక్షులు గా బార్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, శ్రీకాంత్ రాష్ట్ర నాయకులు, ప్రధాన కార్యదర్శిగా జి. వెంకట్రామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బలరాం, కోశాధికారి జోషి, ఉపాధ్యక్షులు కాశీనాథ్ (ఎఫ్ ఏ), ఆంజనేయులు, అంజి లయ గౌడ్, భీమ్సప్ప( ఎఫ్ ఏ), సహాయ కార్యదర్శిలుగా గోపాల్, గోవిందరాజు, డి. కృష్ణయ్య, ఎన్నుకున్నారు.