Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం పరిధిలో వివిధ గ్రామాలలు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దేవన్నకు చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు చెక్కును. గోపాల్ కు చికిత్స నిమిత్తం 46500 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమైన పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా 50శాతం డబ్బులను రూపంలో లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న , మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి , సర్పంచులు, ప్రతాప్, పురుషోత్తం రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మధు, ప్రభాకర్ పాల్గొన్నారు.