Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -కల్వకుర్తి టౌన్
మున్సిపాలిటీ పరిధిలోని సీకేఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జైపా ల్ యాదవ్ చేతులమీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఆడపడుచులకు రంగు రంగుల నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ మనోహర వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ మున్సిపల్ చైర్మన్ సత్యం వైస్ చైర్మన్ షాహెద్ కౌన్సిలర్స్ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
పెంట్ల వెళ్లి : మండలంలో పంచాయతీ కా ర్యాలయంలో ఆడపడుచులకు బతు క మ్మ చీరలు పంపిణీ చేసిన తహ సీల్దార్ దామోదర్, ఎంపీడీవో రామయ్య స ర్పంచులతో కలిసి ఆయాయ గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మే రకు బతు కమ్మ పండుగ సందర్భంగా మహిళలుకు అందరికీ చీ రలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. అదేవి ధంగా కార్యక్రమంలో సర్పంచ్లు నాగ రాజు, ఖాజా, సువర్ణమ్మ, చంద్రమ్మ,ఎన్ గోపాల్, మార్కెట్ కమిటీి మాజీ డైరెక్టర్ హనుమంతు, మతిన్, హబ్ధుల్ హుస్సేన్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కోడేరు: మండలంలోని జనంపల్లి,పసుపుల గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మల్లికార్జునరావు మా ట్లాడుతూ.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎ స్ పార్టీ మండల అధ్యక్షుడు సూర్య రాజశేఖర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు కవిత కురుమయ్య, విష్ణువర్ధన్ రెడ్డి గ్రామస్తులు ఉన్నారు.