Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మక్తల్
నాబార్డ్ డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నామని నాబార్డ్ వెంకటేష్ తెలిపారు. శనివారం సహకార సంఘం మక్తల్ లో నిర్వహించిన రైతులకు ఆర్థిక అక్షరాస్యత నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలపై సకాలంలో వడ్డీ చెల్లిస్తూ సంఘం అభివద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ శ్రీ వెంకటరమణ చారి, సీఈవో రాములు, డైరెక్టర్లు వెంకటప్ప, మహదేవప్ప రైతులు పాల్గొన్నారు.