Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -వెల్డండ
మండలంలోని గుండాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య విద్యాలయంలో శనివారం తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.1 50 లక్షలతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐక్యత ఫౌండేషన్ గౌరవఅధ్యక్షుడు సుంకిరెడ్డి సుహాసిని కృష్ణారెడ్డిల్ణ, గుండాల సర్పంచ్ మైసయ్య, రిజినల్ కో-ఆర్డినేటర్ నాగార్జున , ప్రిన్సిపాల్ సరస్వతితో కలిసి మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల లో పాఠశాలలో మౌలిక వసతుల సదుపాయాలకు ఐక్యతా ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పర్వత్ రెడ్డి, పారిశ్రామికవేత్త వరప్రసాద్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు రమేశ్ నాయక్, కొండల్, గోపాల్ నాయక్, రవీందర్, చంద్రశేఖర్, రాహుల్ ఉన్నారు.