Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హన్వాడ
మండలంలో శనివారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సమావేశంలో ఆయా శాఖల ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ ప్రగతి నివేదిక చదువుతుండగా మండలంలో కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పలువురు సర్పంచులు మండిపడ్డారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య ఉందని అలాగే వ్యవసాయానికి విద్యుత్ అంతరాయము ఏర్పడుతుందన్నారు. సమస్యపై వివరణ త్వరగా విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనంజయ గౌడ్ తాసిల్దార్ శ్రీనివాసులు జెడ్పీటీసీ విజయనిర్మల, రమణారెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీ మోహన్, వెంకటయ్య వివిధ శాఖల అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ యాదయ్య, ఏవో కిరణ్ కుమార్ ఎంఈవో రాజు నాయక్, ఏపీఎం సుదర్శన్, రాజు యాదవ్ పాల్గొన్నారు.