Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్
పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు..
నర్వ: మండల కేంద్రంతో పలు విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. బతుకమ్మ పండు గ పురస్కరించుకుని.. కళాశాలలు, పాఠశాలల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంబరాల్లో ఆయా పాఠశాలల హెచ్ఎం మల్లేష్, రాజేష్, హన్మంత్ రెడ్డి, సత్యనారాయణ, ఉపాధ్యాయులు లక్ష్మణ్, రాజేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు.
గట్టు: మండలంలోని మాచర్లలో శనివారం బతుకమ్మ చీరలు పంపిణీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో అంగన్వాడీ టీచర్లు గ ర్భిణులకు సాముహిక సీమంతాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆడప డుచు లకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చే స్తుందన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ విజరు, జెడ్పీటీసీ బాసు శ్యామల, పాండు, వెంకటేష్, అధ్యక్షుడు హనుమంతు నాయుడు, సర్పంచ్ సిద్ధిరామప్ప, నాయకులు ఆలీ సురేష్, శ్రీనివాస్ రెడ్డి కురుమన్న, వెంకటేష్, తిమ్మప్ప, పాల్గొన్నారు.
పెంట్లవెల్లి : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాణి, ప్రధానో పాధ్యాయుడు బల రామకృష్ణ రావు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదా యాలని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షాహీన్ బేగం, కవిత, రాధాబాయి, రేవతి, అరుణ, అర్జున్ గౌడ్ పాల్గొన్నారు.
ఉట్కూర్: మండల పరిధిలోని నిల్గుర్తిలోని శనివారం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబుర ాలు చేశారు. ఈ సందర్భంగా రకరకాల పువ్వులతో బతుక మ్మ తయారుచేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు
మరికల్ : మండలంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్న త పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు, శనివారం బతు కమ్మ సంబురాలు ఘనంగా చేశారు. హెచ్ఎం మనో రంజని మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాలు నిర్వహించ డం అభి నందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఉపా ధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మండల పరిధిలోని బుడ్గాని తాండ ఎంపీపీ ఎస్ హెచ్ఎం లక్ష్మయ్య ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేష్, బుడ్డేగన్ తాండ సర్పంచ్ రాములు నాయక్, ఉపసర్పంచ్ భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు తెలకపల్లి: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబురాలు చేశారు. ఈ నెల 26 నుంచి పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో చివరి రోజైన శనివారం విద్యార్థులు రం గురంగులపూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో బ తుకమ్మ ఆడారు. అనంతరం స్థానిక చెరువులలో బతుక మ్మ లను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
బిజినేపల్లి: శనివారం జీపీఎస్ బిజినేపల్లి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సవంగా వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి సంబ రాలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో భాస్కర్ రెడ్డి, ఉb ాధ్యాయులు పుష్పలత, సరిత ఎమ్మార్సీ సిబ్బంది ప్రభాకర్, బాలయ్య, మురళీకృష్ణ, సిబ్బంది శేఖర్, మల్లేష్ పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి: మండలంóలోని గంట్రావుపల్లిలోని శనివారం హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపా ధ్యాయులు బతకమ్మ సంబురాలు నిర్వహించారు. అనంత రం గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు కార్యక్రమంలో భాస్కర్, పవన్, శివుడు, శేఖర్, హుస్సేన్, కురుమయ్య, గౌస్ పాష పాల్గొన్నారు
తిమ్మాజిపేట: మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయగిరిలో పీఎస్ గొరిట పాఠశాలల్లో విద్యార్థులు శనివారం బతుకమ్మ సంబురాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారుచేసి సాంప్రదాయ పాటలు పాడారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్యతో కలిసి విద్యార్థులు స్థానిక చెరువుల్లో బతుకమ్మలను వదిలారు. హెచ్ఎం వెంకటేశ్వర్లు శ్రీనివాసులు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
వెల్దండ: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రా మాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపా ధ్యాయులు, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆటలు ఆడి పాడారు.
తాడూరు: మండలంలోని ఆకునెల్లికుదురుల ప్రభుత్వ పాఠశాలలో బతకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని ఆమె తెలిపారు. సర్పంచ్ కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.