Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్: వచ్చే నెల 16న టీఎస్పీ ఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ గా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఎల్బీ, ఎస్పీలతో కలిసి విద్యాధికారు లు, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.. వచ్చే నెల 16న టీఎస్పీ ఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. పరీక్ష కోసం జిల్లాలో 15 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, దాదాపు4876 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రూప్స్ పరీక్షల జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్‌గా అదనపు కలెక్టర్ ఎల్బి శ్రీహర్ష వ్యవహరి స్తారని తెలిపారు. గుర్తించిన పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు, ఇన్విజిలేటర్లను కేటాయించే పని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ఎల్ బి శ్రీహర్ష, అదనపు ఎస్పీ రాములు నాయక్, జిల్లా విద్యాధికారి సిరాజుద్దీన్, తహసిల్దార్ వెంకటేష్, ఇతర శాఖల అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.