Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 62వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వనపర్తి వీఆర్ఏల జెఎసి మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయాలని, వయస్సు పైబడిన వీఆర్ఏల కుటుంబ వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పలుమార్లు తమ నిరవధిక సమ్మెను విరమించాలని కోరుతున్నారని, కానీ తమ డిమాండ్లను నెరవేర్చడానికి ముందుకు రావడం లేదన్నారు.
పెంట్ల వెళ్లి : మండల కేంద్రంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరియు జిల్లా జేఏసీ పిలుపు మేరకు పెంట్లవెల్లి మండల వీఆర్ఏలు నిరవధిక సమ్మెలో భాగంగా నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వీఆర్ఏ లకు ఇచ్చిన పేస్కెల్ జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏ ల సంఘము మండల అధ్యక్షుడు బిజ్జ స్వాములు అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బి స్వాములు, ఉపాధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సి కోటేశ్వరి, ఉప కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి టి వెంకటయ్య, రమేష్ నాయుడు, రాజు, ఆశన్న,ఏ కురుమయ్య, లక్ష్మీ పాల్గొన్నారు.
ఉట్కూర్: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు మండల కేంద్రమైన ఊట్కూర్ లోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏజేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మె శనివారానికి 62వ రోజుకు చేరుకుంది. సమ్మెను ఉద్దేశించి నాయకులు తిరుపతి భీమ్ రావు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దకొత్తపల్లి : రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలంగా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మండల వీఆర్ఏల జేఏసీ సమ్మె శనివారం నాటికి 61 రోజు చేరుకుంది .ఈ సందర్భంగా మండల వీఆర్ఏ జేఏసీల చైర్మన్ మల్లేష్ నాయుడు మాట్లాడుతూ నిరవధికంగా 61 రోజులు చేరిన వీఆర్ఏల సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ కో కన్వీనర్ రాములు, జనరల్ సెక్రెటరీ ప్రసన్న, బంగారయ్య ,లలిత ,చిన్న నరసింహ, మద్దిలేటి ,కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు .