Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ కలెర్టరేట్
హరితహారం కార్యక్రమం కింద రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కలతోపాటు, మహబూ బ్‌నగర్ పట్టణం సుందరీకరణలో భాగంగా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. శనివారం ఆయన కెసిఆర్ ఎకో అర్బన్ పార్క్ నుండి మహబూబ్ నగర్ పట్టణం వరకు ప్రధాన రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలు, రహదారి మధ్యలో నాటిన సెంట్రల్ మీడియన్ మొక్కలను పరిశీలించారు. అక్కడక్కడ మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్నచోట తక్షణమే పొడవాటి, పెద్దవైన మొక్కలు నాటించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మొక్కలన్నింటికీ క్రమం తప్పకుండా నీటిని పోయాలని,ఎక్కడైనా మొక్కల భాగాలు ఎండిపోయినట్లయితే తీసివేవేయాలని ఆదేశించారు.పట్టణ సుందరీకరణ లో భాగంగా ఏర్పాటు చేసిన తొట్లలో అందాన్ని ఇచ్చే విధంగా పూల మొక్కలు ,ఇతర పెద్ద మొక్కలు నాటాలని ఆయన మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రోడ్లు భవనాల అతిథి గృహం వద్ద చేపట్టిన కూడలి అభివృద్ధి, ఫౌంటెన్ తదితర నిర్మాణాలను తనిఖీ చేశారు .పనులను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేకించి మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిశ్రాంత కృషి చేస్తున్నారని, పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి చేస్తున్న కృషికి జిల్లా అధికారులు తోడ్పడునందించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు.