Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పెద్దమందడి
అర్హత కలిగిన వారి అందరికీ ఆసరా పింఛన్లు ఇస్తాం, తెరాస ప్రభుత్వని ఆశీర్వదించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండల పరిధిలోని వీరాయపల్లి, మంగంపల్లి, దొడగుంటపల్లి, చిన్నమందడి. అల్వాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతనంగా మంజూరైన కొత్త ఆసరా పింఛన్లు పత్రాలు అదేవిధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఆసరా పింఛన్లను తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. గతంలోనే 40 లక్షలు, మొత్తం 50 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో తెరస ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో దాదాపు 200 మందికి చొప్పున ఆసరా పింఛన్లను అర్హత కలిగిన వారికి ప్రతి ఒక్కరికి తెరస ప్రభుత్వం ఆసరా పింఛన్లను ఇచ్చా మన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన ఆడప డుచులకు దసరా పండుగకు కోటి మహిళలకు చీరలను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇంటికి పెద్ద దిక్కు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉన్నాడని తెలిపారు. అభివద్ధి చేసిన తేరస ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖర రావుకు ఆశీర్వదించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ మెగారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. మండల రైతు బంధు అధ్యక్షులు రాజా ప్రకాష్ రెడ్డి, వైస్ ఎంపీపీ రఘు ప్రసాద్. సింగల్ విండో ఉపఅధ్యక్షులు కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సింగల్ విండో అధ్యక్షులు సత్యారెడ్డి,మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి, సర్పంచులు భాగ్యమ్మ, వరలక్ష్మి, సూర్యచంద్రారెడ్డి, సువర్ణ పెద్దమందడి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్, మండల నాయకులు. కొన్నూరు శ్రీనివాస్ రెడ్డి. బుచ్చిలింగం,గౌని వెంకటేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఎంపిటిసి భార్గవి. ఉపసర్పంచ్. చెన్న కిష్టమ్మ. గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్. వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు. అధికారులు ఎంపీడీవో అఫ్జల్, ఆర్ఐ తిరుపతయ్య. ఏపిఎం వెంకన్న, పాల్గొన్నారు.