Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వంగూరు
వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో గల 100,103 సర్వేలో ఉన్న మూడు ఎకరాల భూమిని 22 సంవత్సరాల క్రితం పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం కొనుగోలు చేసి నేటి వరకు కూడా పేదలకు ఎందుకు ఇండ్ల స్థలాలు ఇస్తలేరని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అధ్యక్షులు చింత ఆంజనేయులు ,మండల కార్యదర్శి బండపల్లి బాలస్వామి వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కొండారెడ్డి పల్లి గ్రామ శివారులోని రాంనగర్ లో ఉన్న మూడు ఎకరాల భూమి లో ఉన్న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కంప చెట్లను తొలగించి చదును చేశామని వారు తెలిపారు. ఇండ్ల స్థలాలు లేని పేదలు ఎంతో మంది కొండారెడ్డిపల్లి జాజాల పోల్కంపల్లి రంగాపూర్ ఉల్పర కోనాపూర్ గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంగయ్య, పర్వతాలు, విష్ణు, గణేష్ ,బుచ్చయ్య జంగయ్య ,మల్లేష్ ,ప్రసాద్, జంగమ్మ, వెంకటమ్మ ,అనసూయ, శ్రీకాంత్, సిద్దయ్య ,లింగయ్య పాల్గొన్నారు.