Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం ఎమ్మెల్యే అసమర్థత.
- మళ్లీ పేదలతో కలిసి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమిస్తాం.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు
నవ తెలంగాణ- కందనూలు
అక్రమ అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అసమర్థతనే నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాలేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆక్రమణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పేదలు అధికారులకు విన్నవించారని వినతి పత్రాలు సమర్పించారని ఆయన స్పందన లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం వాటి నిర్మాణం కోసం చొరవ చూపకపోవడం దుర్మార్గమని తెలిపారు. కాంట్రాక్టర్లు కూడా తమ సమస్యల్ని ఎమ్మెల్యేకు విన్నవించిన పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నడని అన్నారు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన తరువాత ప్రారంభమైన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గానీ టీఆర్ఎస్ భవనం కానీ త్వరగా పూర్తయి పేదల నివసించాల్సిన గృహాలను మాత్రం పట్టించుకోకపోవడం అంటే పేద ప్రజల పట్ల స్థానిక ఎమ్మెల్యే కున్న గౌరవం అర్థమవుతున్నదన్నారు. కేవలం 192 ఇండ్లను మాత్రమే తూతూ మంత్రంగా నిర్మిస్తున్నాడని పట్టణంలో వేలాదిమంది పేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం రద్దు చేసిన ఇండ్ల స్థలాల పంపిణీ జీఓ ను వెంటనే పునః ప్రారంభించాలని ప్రతి పేదవాడికి 120 గజాల ఇండ్ల స్థలాన్ని ఇచ్చి పది లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ కే గీత బి ఆంజనేయులు మండల కార్యదర్శి అశోక,్ , యాదయ్య ,ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాస్ బాల్రెడ్డి ,శివ వర్మ, తారా సింగ్, రామయ్య, శివకుమార్, సత్యనారాయణ వెంకటేష్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.