Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వెల్డండ
పేద ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యతా ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఆ దిశగా విద్య వైద్యం ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఫౌండేషన్ ముందుకెళ్తుందని పారిశ్రామికవేత్త వర ప్రసాద్ రెడ్డి , ఫౌండేషన్ సభ్యులు సురేష్ రెడ్డి అన్నారు.వెల్దండ మండల పరిధిలోని బర్కత్ పల్లి గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు 7 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన సీసీ రహదారి పనులను శనివారం గ్రామ సర్పంచ్ బీరయ్య తో కలిసి పారిశ్రామికవేత్త వర ప్రసాద్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు సురేష్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తినియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ హామీ ఇచ్చిన అభివృద్ధి పనులు గ్రామాల్లో శరవేగంగా యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహ ,గ్రామస్థులు శ్రీనివాస్ రెడ్డి, బాల్ చెన్నయ్య, ఫౌండేషన్ సభ్యులు రమేశ్ నాయక్ ,కొండల్ ,జగన్ ,గోపాల్ నాయక్, రాహుల్ తో పాటు తదితరులు ఉన్నారు.