Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కొత్తకోట
మున్సిపల్ పరిధిలో 106వ పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థాని క చౌరస్తాలో నాయకులు ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్ర మం లో పార్లమెంటు కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పాల్గొని ఉపాధ్యాయ జీవిత విశేషాలను కార్యకర్తలకు సూచించారు. ప్రపంచ చిత్రపటంలో అన్ని వాదాలు కనుమరుగవుతున్న తరుణంలో ఉపాధ్యాయ ప్రవేశపెట్టిన ఏకాత్మత మానవతా వాదం నిజమైనదిగా ప్రపంచ దేశాలు గుర్తించడం, వారి దూర దృష్టికి నిద ర్శన మని డోకూర్ పవన్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమం పట్టణ శాఖ నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు.