Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు అభ్యంతరాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి
- అడవి హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం కమిటీలు వెయ్యాలి
- తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్
నవ తెలంగాణ- వనపర్తి : పోడు భూముల సమస్యలను జిల్లా స్థాయి సమన్వయం చేసేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని జారీ చేసిన 140 జీవోను అమలు చేయాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలోని గిరిజన సంఘం కార్యాలయంలో సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా అధ్యక్షుడు ఏం బాల్య నాయక్, ఉపాధ్యక్షుడు వినాయక్ మా ట్లాడా రు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం జిల్లా స్థాయిలో పార్లమెంట్ మెంబర్, శాసన సభ్యులు సైతం జిల్లా సమన్వయ కమిటీలు చేర్చడం సరికాదని రాష్ట్ర హైకోర్టు అభ్యంతరాలను వ్యక్తం చేసిందన్నారు. కమిటీల్లో రాజకీయ జోక్యం పెరిగి అర్హులకు హక్కులు లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరుతూ హైకోర్టు అక్టోబర్ 21కి కేసును వాయిదా వేసిం దన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు గత ఏడాది నవంబ ర్లో రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములను సాగుదారుల నుంచి వనపర్తి జిల్లాలో సుమారు 10 వేల దరఖాస్తులు పెట్టుకున్నారన్నారు. ఏడాది గడుస్తున్నా పరిష్కా రం జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల లబ్ధి దారులకు హక్కు పత్రం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సాగు దారులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు ఆలస్యం చేయకుండా తక్ష ణమే పట్టాలి వ్వాలని కోరారు. రాజకీయ జోక్యం లేకుండా గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీ గా ఉంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు రాష్ట్ర స్థాయి లో ప్రధాన కార్యద ర్శులు, జిల్లా స్థాయిలో కలెక్టర్, సబ్ డివిజన్ స్థాయి ఆరడీవో, ఎమ్మార్వో కార్యాల యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని అటవీ హక్కు 140 గుర్తింపు చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని హైకోర్టు అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గుర్తిం పు చట్టం ప్రకారం కమిటీలను వేసి దరఖాస్తులను పరిశీలించి, హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు చంద్రు, రాములు, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు..