Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే
- 30 ఏళ్ల క్రితం జిల్లాకు పరిచయమైన ''చికెన్ ఫ్రై''
- ఒక్కో షాపులో రోజుకు 30 కిలోల వరకు అమ్మకాలు
నవతెలంగాణ -కందనూలు
చికెన్ ఫ్రై, జొన్నరొట్టె రుచికి నాగర్క ర్నూల్ జిల్లా వాసులు అలవాటు పడిపోయారు. దీంతో ఒక్కో షాపులో రోజుకు 30 కిలోల చొప్పున మొత్తం 50 షాపుల్లో దాదాపుగా 1500 కిలోల వరకు చికెన్ ఫ్రై అమ్మకాలు జరుగుతాయి. మన దేశంలో ప్రతి ప్రాంతానికి ఒక ఫుడ్ కల్చర్ ఏర్పడింది. ఒక్కో ఏరియాలో ఒక్కో రకమైన వంటకం పేరుగాంచింది. ఉదాహ రణకు హైదరాబాద్ బిర్యానీ, గుంటూ రు మిర్చి బజ్జి, కర్నూల్ ఉగ్గాని బజ్జీ, కాకినాడ ఖాజా, ఆత్రేయపురం పూతరేకులు, అరకు బొం గులో చికెన్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వం టకం ప్రసిద్ధిగా నిలుస్తున్నాయి. అటువంటి ఒక రుచి కరమైన వంటకం మన పట్టణంలోనూ పాపులర్ అయింది. అదే చికెన్ ఫ్రై, జొన్నరొ ట్టే. గత కొన్నేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ఈ చికెన్ ఫ్రై, ఇక్కడి ప్రజలకు ఎంతగానో నచ్చింది.
30 ఏళ్ల క్రితం
జిల్లాకు పరిచయమైన ''చికెన్ ఫ్రై''
చికెన్ ఫ్రై అన్నీ ప్రాంతాల్లోనూ ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాల్లో హౌటల్స్, రెస్టారె ంట్లకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తేనే వాటిని తయారు చేసి అందిస్తారు హౌటల్స్ వారు. కానీ నాగర్‌కర్నూల్‌లో మాత్రం చికెన్ ఫ్రై ఇన్‌స్టంట్‌గా దొరుకుతుంది. వచ్చే కస్టమర్లు ఎక్కువగా చికెన్ ఫ్రైనే ఆర్డర్ చేస్తుండడంతో ఇక్కడ ఫాస్ట్‌ఫుడ్ కంటే వేగంగా చికెన్ ఫ్రై అం దుబాటులో ఉంటుంది.మొట్టమొదటగా 30ఏళ్ల కిందట పట్టణంలో ఈ చికెన్ ఫ్రై, జొన్న రొట్టె వంటకం పరిచయమైంది. ''రెడ్డి చికెన్ ఫ్రై సెంటర్'' ద్వారా నగర వాసులకు ఈ వంటకం పరిచయమైంది. చికెన్ ఫ్రై టేస్ట్ బాగుండటం తో క్రమంగా ఆ కల్చర్ విస్తరి స్తూ వచ్చింది. ఒక షాపుతో మొదలై ప్రస్తుతం పట్ట ణంలో దాదాపు 50 వరకు చికెన్ ఫ్రై సెంటర్లు వెలిసాయి. ప ట్టణంలో ఉయ్యాలవాడ వార్డ్ సరిహద్దు నుంచి నల్లవెల్లి రోడ్, శ్రీపురం రోడ్, కొల్లాపూర్ చౌర స్తా, ఎండబెట్ల వరకు నగరం నలుమూలలో విస్తారం గా చికెన్ ఫ్రై సెంటర్లు వెలిశాయి.
రోజుకు 30 కిలోల వరకు అమ్మకాలు
చికెన్ ఫ్రై, జొన్నరొట్టె రుచికి జిల్లా వాసులు అలవాటు పడిపోయారు. దీంతో ఒక్కో షాపులో రోజుకు 30కిలోల చొ ప్పున మొత్తం 50షాపుల్లో దాదాపుగా 1500 కిలోల వరకు చికెన్ ఫ్రై అమ్మకాలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకూర్తి నియోజకవర్గాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఎక్కువ గాచికెన్ ఫ్రై వంటకాన్ని తినే వెళ్తారని దుకాణదారులు అంటున్నారు.
కిలో చికెన్ ఫ్రై రూ.150 మాత్రమే..
సాధారణంగా పెద్ద హౌటల్స్‌లో దొరికే చికెన్ ఫ్రై.. ప్లేట్ ధర రూ. 150 - రూ. 400 ఉం టుంది. అయితే నా గర్ కర్నూల్లో మా త్రం చికెన్ ఫ్రై వం టకాన్ని ప్రజలకు అందుబాటులో ఉం డే ధరల్లోనే అందిస్తున్నారు దుకాణదారులు. కిలో చికెన్‌ను ఫ్రై చేసి రూ.150 వరకు వసూ లు చేస్తాం.
-ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై యజమాని వెంకటేశ్