Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి గొంగళ్ళ రంజిత్ కుమార్
ధరూర్ : ప్రజా సమస్యలను పరిష్కరానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెనిద్ర చేస్తున్ననని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. గద్వాల మండలం కాకులారం గ్రామంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి బస చేసి, ఉదయాన్నే గ్రామంలో కలిగే తిరుగుతూ పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గామంలో ఎస్సీ కాలనీలో చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలిచిపోయి దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పిచ్చి మొక్కలు, గడ్డి ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోయారు.జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలకు వెళ్లే దారి వర్షం వచ్చినప్పుడు గుంతల వల్ల బురదమయం అవుతోందని తెలిపారు. సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు నాయ కులకు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో తిమ్మప్ప, రామాంజనేయులు ఆంజనేయులు, జగదీష్ లతోపాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లవన్న,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి ఉలిగేపల్లి తిమ్మప్ప, ఉలిగేపల్లి లక్ష్మన్న, ఉప్పరి కృష్ణ,దాసరి పల్లె రాముడు, నాగర్ దొడ్డి కృష్ణ, నజుముల్లా రమేష్,ఆలూరు వెంకట్రాములు,ఆశన్న, గోపాల్, దయాకర్,గుండన్న, తిమ్మప్ప,వీరేష్,కృష్ణ ,తిరు మలేష్, పాల్గొన్నారు.