Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సుధాకర్
నవ తెలంగాణ- వనపర్తి
మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యాల యంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అనుబంధం వనపర్తి జిల్లా రెండవ మహాసభలు నిర్వహించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సుధాకర్ పాల్గొని జెండావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ మున్సిపల్ వర్కర్స్కు రూ.21000 ఇవ్వాలని, నేటికీ జిల్లాలో కేటగిరీల వారీగా వేతనాలు అమలు లేదని, వెంటనే కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలన్నారు. బకాయి పడ్డ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హెల్త్ పాలసీ ఏర్పాటు చేయాలని, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. వనపర్తి పట్టణంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికీ పీఎఫ్, ఈఎస్ఐ తప్పక అమలు చేయాలని కోరారు. ఈ మహాసభలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐదు మున్సిపాలిటీలు వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింతల మున్సి పల్ వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎం.చంద్రయ్య, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పుట్ట ఆంజనేయులు, కోశాధికారిగా యాదగిరి, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులుగా కే వెంకటయ్య కొత్తకోట, భగవంతు పెబ్బేరు, ఇస్మాయిల్ ఆత్మకూరు, సురేందర్ వనపర్తి, నరేష్ వనపర్తి, సహాయ కార్యదర్శిగా ప్రభాకర్ అమరచింత, బాలు వనపర్తి, కే.మాన్యం వనపర్తి, యు.రాజు పెబ్బేరు, శివ కొత్తకోట, మగ్ బుల్, ఆత్మకూరు, కమిటీ సభ్యులుగా రాములు, రంజిత్, పెబ్బేరు, కపయ్య, రాజు కొత్తకోట, మహబూబ్ ఆత్మకూరు, అనంతమ్మ పెబ్బేరు, లక్ష్మీ కొత్తకోట, వరలక్ష్మి, వెంకటమ్మ, బాలస్వామి, రాణమ్మ, శాంతయ్య, లక్ష్మయ్య వనపర్తి, అనంతమ్మ పెబ్బేరు, ఈశ్వరమ్మ పెబ్బేరు, సరళ శిరీష కొత్తకోట నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు