Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా పండుగ తర్వాత గుడిసెలు తీసి ఇల్లు నిర్మించుకోవాలి.
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్.
నవతెలంగాణ- అమరచింత
గుడిసెలు వేసుకొని జీవిస్తున్న లబ్ధిదారులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ అన్నారు. ఆదివారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ధూమ్ పాయి కుంటలో లబ్ధిదారులు గుడిసెలు వేసుకొని భూ పోరాటం నిర్వహిస్తున్నారు. ఈ భూ పోరాటానికి వారు హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడుతూ. పేదలకు ఇండ్లు పంచడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తగదని వెంటనే స్పందించి ధూమ్ పాయి కుంటలో గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులకు పొజిషన్ పత్రాలను హద్దులను చూపించి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా ధూమ్ పాయి కుంటలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న, మున్సిపల్ అధికారులు కానీ తహసీల్దార్ కానీ స్పందించకపోవడం శోచనీయం మన్నారు. గుడిసెల పోరాట ప్రారంభంలో గుడిసెల దగ్గరకు తహసీల్దార్ సింధుజ వచ్చి నెల రోజులలో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు కూడా భూమిని సర్వే కూడా చేయించడం లేదని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అలాగే నిర్లక్ష్యం వహిస్తేసీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో దసరా పండుగ తర్వాత ఏకంగా గుడిసెలు తీసి ఇటుక పేల్లలతో ఇల్లు నిర్మాణం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో చేపడుతామని పభుత్వ అధికారులకు హెచ్చరించారు. గతంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం తో ఫలించిన ఫలితం ఆధారంగా నే గ్రామపంచాయతీ అధికారులు 1997 లో సర్వే నెంబర్56,57 లో14:37 గుంట ఎకరాల భూమిలో లబ్ధిదారులకు 400 మందికి రెండు సెంట్ల చొప్పున ప్లాట్లను ఇవ్వడం జరిగిందినీ అదే స్థలంలో ఈరోజు గుడిసెలు వేసుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్లాట్లు ఇచ్చి 25 సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు కూడా పొజిషన్ పత్రాలు కానీ హద్దులు చూపించకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని ఈ నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారులు వీడాలని గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జి ఎస్ గోపి, మండల నాయకులు బి వెంకటేష్, ఎస్ అజరు, బుచ్చన్న, అనంతమ్మ వీరితో పాటు గుడిసెల చేసిన లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.