Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింఛన్ లబ్ధిదారుల ముర
- దరఖాస్తులు చేసుకున్న రాని వైనం
- పట్టించుకొని పాలకులు
పభుత్వం చేపట్టిన పింఛన్ లబ్ధిదారులకు 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ప్రకటించారు. గ్రామాల్లో పింఛన్ రాలేదని లబ్దిదారులు ఆరోపించారు. ఆ గ్రామాల్లో అధికారులు చిన్న కార్యక్రమాలు చేపట్టారు. అయిన అర్హత కలిగిన వారికి ఇవ్వలేదని లబ్దిదారులు తెలిపారు.
నవతెలంగాణ - పాన్గల్
పాన్గల్ మండలం లో 28 గ్రామ పంచాయలున్నాయి. 2775 అర్హత కలిగిన అన్ని రకాల పింఛన్లు ఉన్నారు. ఆన్ లైన్ ద్వారా పింఛన్ దరఖాస్తులు చేసుకున్నారు అయితే గత వారం రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 1538 పింఛన్లు మంజూరు చేశారు. 750 అర్హత కలిగిన అన్ని రకాల పింఛన్లు లబ్ధిదారులకు పింఛన్ మంజూరు చేయలేదు.వారం రోజులు క్రితం వనపర్తి జిల్లా కలెక్టర్ షక్ యాస్మిన్ భాష ,కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. గ్రామాల్లో పింఛన్ లబ్దిదారులు మాకు అన్ని అర్హత కలిగిన వారికి పింఛన్ రాలేదని పింఛన్ రాని లబ్ధిదారులు అడ్డుకున్న సందర్భరాలున్నారు. దావూదీ పల్లి, అన్నారం, మాందాపురం, జమ్మాపూర్ కేతపల్లి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించిన సందర్భంగా పింఛన్ కార్డు గ్రామాల్లో వికలాంగులు వృద్ధులు భర్త కోల్పోయిన ను నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ గారికి తమకున్న అన్ని అర్హులైన ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మండల కార్యాలయంలో 65 సంవత్సరాలు దాటిన వారు వికలాంగులు చేసుకున్న దరఖాస్తు కాపీని జిల్లా కలెక్టర్ గారికి లబ్ధిదారులుగోసను వినిపించారు. ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు అర్హులైన వారికి పింఛన్ మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. కానీ కలెక్టర్ హామీ ఇచ్చిన గడువు దాటి పోవడంతో ఈనెల 23న వందలాది మంది పింఛన్ లబ్దిదారులు పాన్గల్ మండల కేంద్రానికి తరలివచ్చి నిరసన చేసి ఎంపీపీ శ్రీధర్ రెడ్డికి వినతి పత్రం అంద జేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హత కలిగిన వారికి దరఖాస్తు చేసుకున్న పింఛన్ దారులకు ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలని ఆ గ్రామాల పింఛన్లు ల లబ్ధిదారులు కోరారు.
75 సంవత్సరాలు దాటిన నాకు పింఛన్ రాలేదు
పాన్గల్ మండలం తెల్ల రాళ్ల పల్లి తాండ కు చెందిన 75 సంవత్సరాల వృద్ధురాలు. ప్రభుత్వానికి ఎన్నోసార్లు పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. పింఛన్లు మంజూరు లిస్టులో నా పేరు రాలేదు. నాకు ఆస్తిపాస్తులు లేదు. నాకు ఆలన పాలన చేసుకునే వారు లేరు. నాకున్న ఇద్దరు కుమారులు వలసలు వెళ్లారు.
- ఆసిఫా, వృద్ధురాలు, బికినీ తెల్ల రాళ్ల పల్లి తండా