Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి
వీపనగండ్ల : భీమా జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని నరసింహ స్మారక భవనంలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రెండో మహాసభ ఎం కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో బీమా పేస్ వన్ టూ జూరాల చివరి ఆయకట్టు కొరకు రైతులకు తాగునీరు అందించక పోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడు తుందన్నారు. దీని వల్ల రైతులు తీవ్రంగా ఆందోళనలకు గురవుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు లేనిచో రైతులను సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరంజన్ వెంకటేశ్వర్లు గౌడ్ బాలా గౌడ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
మండల రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక
మండల అధ్యక్షులు గా ఎం కృష్ణయ్య కార్యదర్శిగా మహబూబ్ బాషా మండల ఉపాధ్యక్షులుగా మౌలాలి రాములు సహాయ కార్యదర్శులుగా శేఖర్ రెడ్డి ఈశ్వర్ ,13 మంది కమిటీ సభ్యులుగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.