Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాత ' అయోమయం '
- పొంగుతున్న వాగులు
- వర్షంతో పంటలకు చుట్టుముడుతున్న తెగుళ్లు
- సాగు పెరిగిన దిగుబడి తగ్గిన వైనం
- ఆందోళనలో అన్నదాత
మే మొదటి వారంలో ఖరీఫ్ ప్రారంభమైనది. తాగు ఆశాజనకంగా సాగింది. జూన్, జూలై మాసాలలో వర్షాలు రావడంతో పంట చేలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన అతివృష్టి కి పంటలన్నీ నీరు వచ్చి పంటలను దెబ్బతిన్నాయి. దీంతో 100శాతం దిగుబడి వస్తుందని కలలుగన్న రైతుల ఆశలు నిరాశగానే మిగిలింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
45 రోజులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు మరోసారి పత్తి, వేరుశెనగ,కంది,పంటలు జలమయమయ్యాయి. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. రండు నెలలుగా కురిసిన అతివృష్టి కి పంటపొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.వారం రోజుల క్రితం ఆగిన వర్షం కొంత ఊరటనిచ్చింది. దీంతో పత్తి ఎదుగుదల ఆగిపో యింది. పక్షం రోజులుగా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పత్తి నేటి పాలవుతుందని రైతులు తెలిపారు. గతంలో కురిసిన వర్షాలకు సగం పత్తి కాయలు పూత నేలమట్ట మయింది. చెట్టుకు 150 కాయలు కాయలు ఉండాలి. పత్తి కేవలం ఈ సారి 20,30 కాయలకు మించి లేవు.ముఖ్యంగా ఒక్కసారైనా పత్తి తీయకముందే లూటిపోయినట్లుగా పంటచేలు మారాయి. ఉన్న కొద్దిపాటి కాయల పత్తిని తీయాలను కుంటే తెగుళ్లు పంటచేలను చుట్టుముడు తున్నాయి.పత్తి మొత్తం పంట చేలల్లోనే నీటి పాలవుతోంది. కురుస్తున్న వర్షాలకు పత్తికాయ పూత లేకుండా పోయిందని పత్తి రైతు తెలిపారు.కాసిన కాయలు తీయకుండా అలాగే ఉంచితే వర్షం చేత మొలకలు వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ పత్తిని తీసి ఇంటికి తెచ్చిన నిల్వ చేసుకునే అవకాశం లేదన్నారు. దీంతో చేసేది లేక రైతులు పంట పొలాల్లోని పత్తిని తీయకుండా వదిలేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటను సాగు చేశారు. ఇందులో విత్తన ఉత్పత్తి 56 గంటలకు పైగా గద్వాల, అలంపూర్, ఇటిక్యాల, ఉండవల్లి, గట్టు ఐజ, ప్రాంతాలలో అధికంగా పండిస్తారు.గతంలో ఉన్నా వృష్టి అయినా కనీసం 50 శాతం అయినా దిగుబడి వచ్చేది. కానీ ఈ సంవత్సరం ఖరీఫ్ ఆశాజనకంగా వర్షాలు కురిసినప్పటికీ పది శాతమైనా దిగుబడి వచ్చే అవకాశాలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట సైతం పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. లోతట్టు ప్రాంతాలలో వేసిన వరి పంట వరదలతో నీటమునిగింది.ఇక వేరుశనగ, మొక్క జొన్న, ఇతర పంటల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. మొన్నటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో అనావృష్టి పంటలు లేక రైతులు అప్పులపాలైయితే ఈ సంవత్సరం అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతిని కోట్లల్లో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టాన్ని పరిశీలించి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని రైతు సంఘాల నాయకులు కోరారు.
జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి పంపటం పొలాలు నీట మునగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి పొలాల్లో నీటిని పాల కుండా చూసుకోవాలి అవసరమైతే వ్యవసాయ అధికారులు సంప్రదించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం
- వెంకటేశ్వర్లు ,జిల్లా వ్యవసాయ అధికారి నాగర్ కర్నూల్
అతివృష్టితో నిలువునా మునిగి పోయాం
నాకు ఉన్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశారు. విత్తనాలు వేసిన 45 రోజులు పత్తి అంట ఏపుగా పెరిగింది. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంట మొత్తం జలమయమై చెట్లు మురిగి పోయాయి. ప్రభుత్వం అనుకోకపోతే మాకు వలసలు తప్పవు.
- వడ్డెమాను నాగయ్య తెలకపల్లి