Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మరికల్
మండల కేంద్రంలో స్థానిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల 8వ స్థాయి క్రీడాల పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మజారాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలలో పాల్గొన్న ప్రతి విద్యార్థి గెలుపు ఓటములు సహజముగా తీసుకోవాలన్నారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించాలని తెలిపారు. క్రీడా పోటీలలో నారా యణపేట మహబూబ్నగర్ జోగులాంబ గద్వాల జిల్లాల బాలికల గురుకుల పాఠశాల నుంచి 680 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. కార్యక్రమానికి చైర్మన్ సురేఖ రెడ్డి, ఎంపీపీ శ్రీకాళ రాజా వర్ధన్ రెడ్డి ,ప్రొఫెసర్ రాణి ,సోషల్ వెరిఫికేషన్ జైంట్ సెక్రటరీ శారద, గ్రామ సర్పంచ్ కే గోవర్ధన్, వైస్ ఎంపీపీ రవి కమార్, ఎంపీటీసీ సుజాత శ్రీనివాసులు, , కోఆప్షన్ నెంబర్ మతిన్, యూత్ అధ్యక్షులు రాజేష్ ,అశోక్, క్రీడాకారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.