Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల సంఘం ఉమ్మడి జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర
నవతెలంగాణ-ఊరుకొండ
వీఆర్ఏ మిత్రులు ఎవ్వరుఅధైర్య పడవద్దని, మన డిమాండ్లు సాధించే వరకు సమ్మెను కొన సాగిద్దామని వీఆర్ఏల సంఘం ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర పిలుపు నిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని వీఆర్ఏ ల సమ్మె శిబిరాన్ని అయన సందర్శించి మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు, వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాం డ్లను అమలు చేయాలంటూ 63 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏ జేఏసి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ పే స్కేల్ జీవోఅమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవ త్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మండల వీఅర్ఏ జేఏసీ ఛైర్మన్ పెట్టి శ్రీశైలం, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ డీ.శ్రీలత, కో కన్వినర్లు సుల్తాన్. జంగయ్య, దశర థం. యాదయ్య, యాదమ్మ, నాగమణి పాల్గొన్నారు.
ఊట్కూర్: మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 63వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరంలో వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ రాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం వీఆర్ఏ జేఏసీ నాయకులు శ్రీనివాస,్ భీమ్రావు, కతాల్, మండలంలోని వీఆర్ఏలు పాల్గొన్నారు.
బల్మూరు: మండల కేంద్రంలో వీఆర్ఏలు కొన సాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు 63వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సంఘం నాయకు లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేకుంటే తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు జహంగీర్, వెంకటయ్య, తిరుపతయ్య, పాల్గొన్నారు.
అయిజ :మండల కేంద్రంలో వీఆర్ఏలు 63 రోజు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు నాగన్న, విఆర్ఎలు నాయుడు, పర్ష, రషీద్, విఆర్ఎలు పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద వీఆర్ఏలు చేపట్టిన సమ్మె కొనసాగు తోంది. ఈ సందర్భంగా వీఆర్ఎల సంఘం మాజీ అధ్యక్షులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పట్టికైనా మా సమస్యలపై స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోవిందు, ఉపాధ్యక్షులు గట్టన్న, నయుం, పరశురాం, రాము లు, కురుమన్న, నాగరాజు, మల్లేశ్, రాము, తిమ్మక్క, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.