Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్వమానవుడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి
- బుద్దారం సాంఘీక గురుకుల పాఠశాలలో మల్టీ జోన్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
నవతెలంగాణ-వనపర్తి
జ్ఞానం ఆర్జించడానికి చదువే గొప్ప ఆయుధ మని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గోపాల్పేట మండలం బుద్దారం సాంఘీక గురుకుల సంక్షేమ పాఠశాలలో మల్టీ జోన్ లెవెల్ స్పోర్ట్స్ మీట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ప్రతి మనిషికీ చదువు ఎంతో అవసరమని, చదువుకుంటే ఎంతో జ్ఞానాన్ని సంపాదించొచ్చని అన్నారు. చదువుంటే ఎంతటి సమస్యనైనా పరిష్క రించే శక్తి సామర్థ్యాలు తమకు ఉంటాయని, దీనిని నిరూపించిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నా రు. దేవుడు వరమిచ్చి ఏం కావాల ని అడిగితే నాకు తిరిగి గురుకుల పాఠశాలలో చదు వు కోవాలని ఉం ది అని కోరుతాన్నారు. ఏ వసతులు లేని సమయం లో బాల్యం నుంచి చదువు పూర్తయ్యే వరకు అనేక కష్టాలు పడి బరోడా మహరాజు సహాయంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాన న్నారు. ప్రపంచంలో అతి కొద్ది మంది సాంఘీక, ఆర్థిక, రాజకీయ మేధావులలో అంబేద్కర్ ఒకర న్నారు. అంబేద్కర్ విశ్వ మానవుడు కావడానికి కార ణం చదుదువేనన్నారు. అందుకే చదువును ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదని, చదువుకునే అవకాశాలను ఎవరూ చేజార్చుకోవద్దన్నారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మూడు రోజుల పాటు కలిసి ఉంటారని, మీ అనుభవాలు పంచుకొని ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఆటల్లో గెలవడం ముఖ్యం కాదని పాల్గొనడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.