Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిమి సంహారక మందుల పిచికారితో అస్వస్థతకు గురైతున్న రైతులు
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు
రైతులు ఏపంట సాగు చేసినా వాటికి చీడపీడలు ఆశించి దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోతారు. దీంతో వాటి నివారణ కోసం రైతులు క్రిమిసంహారక మందులు పిచికారి చేయక తప్పడం లేదు. కానీ వారు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే మందు పిచికా రి చేస్తుండ డంతో అనేకమంది అస్వస్థతకు గురై ఒక్కోసారి ప్రాణాల మీదుకు తెచ్చుకుం టున్నారు. అందువల్ల పంటలకు క్రిమి సంహారక మందులు పిచిచారి చేసే సమ యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
నవతెలంగాణ - తిమ్మాజిపేట
క్రిమి సంహారక మందుల వాడకం లో రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోక పోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ఒక్కొసారి ప్రాణా లకు కూడా ముప్పు వాటిల్లు తుందని మండల వ్యవసాయ అధికారి కమల్‌కుమార్ తెలి పారు. పంటల్లో ఎరువులు, క్రిమి సంహారక మందులు వేసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు పాటిం చ కుం టే పురుగుల మందుల ప్రభావం తో ప్రాణాలు కోల్పో వాల్సి వస్తుందని పరోక్షంగా క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయం పెరుగుదల, నరాల బలహీ నత వంటి వి వచ్చే ప్రమాదం ఉం టుందని తెలిపారు. కావున రైతులు క్రిమి సం హారక మందులు పిచికారి చేసేటప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి వివరిం చారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
- మందులు పిచికారి చేసే సమయంలో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. ముఖానికి మాస్క్ చేతులకు గ్లౌజులు ధరించాలి.
- పిచికారి చేసే సమయంలో పొగ, నీరు తాగడం,భోజనం చేయరాదు.
- పిచికారికి వాడే స్ప్రేయర్లు సరైన కండిషన్లో ఉన్నాయో లేదో గమనించాలి.
- పురుగుల మందు కలిపేటప్పుడు చేతులు ఉపయోగించకుండా కర్రతో కలపాలి.
- కీటక నాశక మందు ఆహార పదార్థాలతో పాటు తీసుకెళ్ల రాదు.
- పురుగుల మందుల డబ్బాలు పిల్లలకు దూరంగా భద్రపరచాలి.
- పురుగుల మందులు వినియోగించే ముందు డబ్బాలపై ఉండే వివరాలను నిక్షిప్తంగా పరిశీలించాలి.
- గాలి వీచే దిశలోనే మందు ద్రావణం పిచికారి చేయాలి, వ్యతిరేక దిశలో చేయొద్దు.
- స్ప్రేయర్ల నాజిల్స్ ను శుభ్రపరచడానికి నోటితో ఊదరాదు.
- మందు కళ్ళల్లో పడితే వెంటనే మంచి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
- మందు డబ్బాలు ఖాళీ అయిన వెంటనే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గొయ్యి తీసి పూడ్చి పెట్టాలి.
- పిచికారి పూర్తి అయిన వెంటనే స్నానం చేసి ఎండిన దుస్తులను వేసుకోవాలి.
- ప్రమాదవశాత్తు మందు ప్రభావానికి గురైతే ప్రథమ చికిత్స అందించి డాక్టర్‌ను సంప్రదించి వాడిన మందుల వివరాలు చెప్పాలి దానికి విరుగుడు ఇస్తారు.
- పిచికారి పూర్తయిన తర్వాత స్ప్రేయర్లును కడిగి విడిభాగాలకు ఆయిల్ పూయాలి.