Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ వనపర్తి : వనపర్తి కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి కార్పెంటర్ కూలీ రేట్లు పెంచాలని షాపులు బంద్ చేయించారు. ఆది వారం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేసి అందరి సమ క్షంలో కూలి రేట్లు పెంచినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి రఘు నాథ చారిలు ఒక ప్రకటనలో తెలిపారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్లందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పెంచిన రేట్లు సోమవా రం నుంచే అమల్లోకి వస్తాయని సంఘ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. ఐదు×నాలుగు సైజు దర్వాజా రూ.1200 నాలుగు×నాలుగు సైజు కిటికీ రూ.1200, బాక్స్ టైపు ప్లేన్ దర్వాజా రూ.5500లు, తలుపులు డబల్ డోర్, సింగల్ డోర్ ప్లెయిన్ రూ.3500లకు పెంచామన్నారు. మరికొన్ని వస్తువుల కూ రేట్లు పెంచినట్లు తెలిపారు. రేట్ల పట్టికలో ఉన్న దానికన్నా తక్కువ డబ్బు లకు ఎవరైనా పని చేస్తే సంఘం తరుపున పదివేలు జరిమానా విధించేందు కు తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కష్ణ, కార్యదర్శి రఘునాథ చారి, వనపర్తి జిల్లా ఐక్య సంఘం అధ్యక్షుడు పరమేశ్వర చారి, పానగల్ మండల అధ్యక్షులు పి రవీంద్రచారి, వనపర్తి జిల్లా ఐక్య సంఘం కార్యదర్శి భిక్షపతి ఆచారి, మున్నూరు శేఖర్ ఆచారి, చెన్నూరు విష్ణు మూర్తి ఆచారి, విశ్వకర్మ కళాకారుడు మేఘశ్యామాచారి, వీపనగండ్ల మండల అధ్యక్షులు రంగస్వామి ఆచారి, శ్రీనివాసచారి, విష్ణుమూర్తి ఆచారి, సురేందర్, మహమూద్, భాష తదితరులు పాల్గొన్నారు.